సారవంతమైన సాగుభూములను లాక్కుంటే అడ్డుకుంటాం

సారవంతమైన సాగుభూములను లాక్కుంటే అడ్డుకుంటాం
  •  జహీరాబాద్ నిమ్జ్ ( NIMZ) నిర్వాసితులతో కోదండరామ్ భేటీ

సంగారెడ్డి జిల్లా: పూర్వకాలంలో  దేశ్ ముఖ్ లు  జాగీర్ధార్ భూములను  గుంజుకున్నట్లు.. కేసీఆర్  రైతుల భూముల లాక్కొంటున్నారన్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు  కోదండరాం ఆరోపించారు. కోట్లాది  రూపాయల విలువైన  భూమిన  ఏడెనిమిది లక్షలకే..  బలవంతపు  భూసేకరణ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా  జహీరాబాద్ లోని  నిమ్జ్ భూ నిర్వాసితులతో  సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ  రాజకీయ నాయకుల  భూ దాహాన్ని తీర్చడానికే.. భూసేకరణ చేస్తున్నారని విమర్శించారు. లాక్కున్న భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. సారవంతమైన భూములను లాక్కుంటే సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి అడ్డుకుంటామని.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కోదండరాం తెలిపారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం

టీమిండియాకు టీ20 కప్పు అందించడమే నా టార్గెట్ 

మోడీ నిజాలు చెప్పరు.. చెప్పనివ్వరు!

ఏడేళ్ల బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి