టీమిండియాకు టీ20 కప్పు అందించడమే నా టార్గెట్ 

టీమిండియాకు టీ20 కప్పు అందించడమే నా టార్గెట్ 

ముంబై: భారత జట్టుకు పొట్టి ప్రపంచ కప్ అందించడమే తన లక్ష్యమని సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఇండియా వరల్డ్ కప్ గెలిచి చాలా సంవత్సరాలు అవుతోందని.. వచ్చే టీ20 కప్పు అందించి తీరుతానన్నాడు. ఈ యేడు ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుతంగా రాణిస్తున్న కార్తీక్.. గతరాత్రి ఢిల్లీతో మ్యాచ్ లోనూ 66 (5 ఫోర్లు, 6 సిక్సర్లు) రన్స్ తో రెచ్చిపోయాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో ఇంటర్వ్యూలో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇలా రాణించడానికి సంజయ్ బంగర్ కారణమన్నాడు. ఆయన సూచన మేరకు ఫినిషర్ రోల్ ను సమర్థంగా పోషించేందుకు సన్నద్ధమవుతున్నానని తెలిపాడు.

స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకెళ్తున్నానని డీకే చెప్పుకొచ్చాడు. ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ అందించడం తన స్వల్పకాలిక లక్ష్యమన్నాడు. ఇక టీమిండియాకు ప్రపంచకప్ అందించడం దీర్ఘకాలిక లక్ష్యమన్నాడు. ఈసారి జరిగే టీ20 వరల్డ్ కప్ లో మన జట్టులో చోటు సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నాడు. వయసు పెరుగుతోంది కాబట్టి మరింత ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని వివరించాడు. కాగా, డీకే ఫినిషర్ గా బెంగళూరుకు విజయాలు అందించడం చూసి మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సంతోషిస్తుంటాడని కోహ్లీ చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

మోడీ నిజాలు చెప్పరు.. చెప్పనివ్వరు!

ఏడేళ్ల బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి

పువ్వాడపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టం