మోడీ నిజాలు చెప్పరు.. చెప్పనివ్వరు!

మోడీ నిజాలు చెప్పరు.. చెప్పనివ్వరు!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. మోడీజీ నిజాలు చెప్పరని.. అదేవిధంగా ఇతరులు నిజాలు చెప్పకుండా అడ్డుకుంటారని రాహుల్ అన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ షార్టేజీతో ఎవరూ చనిపోలేదని మోడీ అంటున్నారని.. ఇది నిజం కాదన్నారు. కొవిడ్ టైమ్ లో సర్కారు నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మంది భారతీయులు మృతి చెందారని చెప్పారు. తాను మొదటినుంచీ ఈ విషయాన్ని చెబుతున్నానని పేర్కొన్నారు. 'మోడీజీ మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. కరోనా మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి బాధితుడి కుటుంబానికి కేంద్రం రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలి' అని రాహుల్ ట్వీట్ చేశారు. 2021 ఏప్రిల్ లో ఢిల్లీలో కొవిడ్ బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను దహనం చేస్తున్న ఫొటోతో 'న్యూయార్క్ టైమ్స్'లో ప్రచురితమైన వార్తా కథనాన్ని ఈ ట్వీట్ కు జోడించారు.

ఇవి కూడా చదవండి

ఏడేళ్ల బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి

పువ్వాడపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికే నష్టం

వరుస ఓటములకు పూర్తి బాధ్యత నాదే