ఉక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం

ఉక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం

కీవ్: పోర్ట్ సిటీగా పిలిచే మరియుపోల్ లో ఉన్న ఉక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం జారీ చేసింది. ఆయుధాలను వదిలేసి సరెండర్ అవ్వాలని లేకపోతే తమ తూటాలకు బలవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. లొంగిపోయిన జవాన్లను యుధ్ధఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేసింది.

ప్రాణాలతో బతకాలంటే లొంగిపోవాలని.. నిన్న రాత్రి నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఉక్రెయిన్ వర్గీయులకు రష్యా వెల్లడిస్తోంది. కాగా, మరియుపోల్ లో పరిస్థితి దారుణంగా ఉందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ చెప్పారు. ఈ సిటీలోని అత్యధిక ప్రాంతం రష్యా అధీనంలో ఉందన్నారు. ఇకపోతే, గత 24 గంటల్లో డజన్ల కొద్దీ ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలను తమ వాయుసేన ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కన్సెన్ కోవ్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

టీమిండియాకు టీ20 కప్పు అందించడమే నా టార్గెట్ 

మోడీ నిజాలు చెప్పరు.. చెప్పనివ్వరు!

ఏడేళ్ల బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి