ప్రజలేం తినాలో ప్రభుత్వం నిర్ణయించదు

ప్రజలేం తినాలో ప్రభుత్వం నిర్ణయించదు

న్యూఢిల్లీ: ప్రజలు ఏమేం తినాలో, తినకూడదో ప్రభుత్వం నిర్ణయించదని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఎవరేం తినాలనేది వారి వ్యక్తిగత ఇష్టమన్నారు. హలాల్ మాంసాన్ని నిషేధించాలని కేంద్రం యోచిస్తోందా అనే ప్రశ్నకు నఖ్వీ పైవిధంగా స్పందించారు. దేశంలోని ప్రతి పౌరుడికి తనకు నచ్చిన ఆహారాన్ని తినే స్వేచ్ఛ ఉందన్నారు.

హిజాబ్ పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్నాటక హైకోర్టు రీసెంట్ గా ఇచ్చిన తీర్పు మీద మంత్రి నఖ్వీ స్పందించారు. భారత్ లో హిజాబ్ పై ఎలాంటి బ్యాన్ లేదని ఆయన స్పష్టం చేశారు. ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. మార్కెట్లు, ఇతర ప్రదేశాల్లో హిజాబ్ ను ధరించొచ్చని నఖ్వీ తెలిపారు. అయితే స్కూళ్లు, కాలేజీలు, ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్లలో మాత్రం హిజాబ్ ను ధరించొద్దన్నారు. విద్యాలయాల్లో ప్రత్యేక డ్రెస్ కోడ్ లు ఉంటాయని.. వాటినే వేసుకోవాలన్నారు. డ్రెస్ కోడ్ లు నచ్చని వారు.. ఇతర విద్యాలయాల్లో చేరొచ్చన్నారు. 

ఇవి కూడా చదవండి:

ఉక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం

టీమిండియాకు టీ20 కప్పు అందించడమే నా టార్గెట్ 

మోడీ నిజాలు చెప్పరు.. చెప్పనివ్వరు!