నుపూర్పై వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ​ అరెస్టు

నుపూర్పై వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ​ అరెస్టు

నుపూర్​శర్మ తల నరికిన వారికి ఇంటిని బహుమతిగా ఇస్తానని వీడియో రిలీజ్​ చేసిన అజ్మీర్​ దర్గా ఖాదిమ్​ సల్మాన్​ చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఎఫ్ఐఆర్​ నమోదు చేసిన రాజస్థాన్​ పోలీసులు, లుక్​ఔట్​ నోటీసు జారీ చేశారు. ఎట్టకేలకు  బుధవారం ఉదయం అతడి అరెస్టును ప్రకటించారు. నిందితుడు సల్మాన్​ చిస్తీకి నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.  మరోవైపు సల్మాన్​ చిస్తీ  వీడియోలోని సందేశాన్ని అజ్మీర్ దర్గా ఆఫీసర్ దివాన్ జైనుల్​ ఆబిదీన్​అలీ ఖాన్  ఖండించారు. అజ్మీర్​ దర్గా మత సామరస్యానికి ప్రతీక అని, వీడియోలో ఖాదిమ్​ వ్యక్తంచేసిన అభిప్రాయాలను దర్గా సందేశంగా చూడొద్దని కోరారు.  వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.   ఆ వ్యాఖ్యలను సల్మాన్​ చిస్తీ వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలని కోరారు. 

నుపూర్​శర్మపై కామెంట్లు సరికాదు: మాజీ న్యాయమూర్తులు

దేశంలో అగ్గిరాజుకోవడానికి నుపూర్​ శర్మే కారణమని, దేశంలో ప్రస్తుత పరిస్థితులకు ఆమె ఒక్కరే బాధ్యురాలని సుప్రీంకోర్టు బెంచ్​ చేసిన కామెంట్లపై మాజీ న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బెంచ్ కామెంట్స్ దురదృష్టకరమని, న్యాయవ్యవస్థకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు. పదిహేను మంది మాజీ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 25 మంది ఆర్మీ మాజీ అధికారుల సంతకంతో కూడిన బహిరంగ లేఖను మంగళవారం రిలీజ్ చేశారు.