
ఆరేండ్ల పాపకు గాయాలు
కూకట్‌పల్లి, వెలుగు: మద్యం మత్తులో ఓవర్ స్పీడ్‌గా కారు నడిపిన వ్యక్తి ముందు వెళుతున్న కారును ఢీకొట్టడంతో ఆరేండ్ల బాలిక గాయపడింది. నిందితుడు కారుతో పారిపోవడానికి ప్రయత్నించగా, స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కూకట్‌పల్లి కమలా ప్రసన్ననగర్‌లో ఉండే రుగ్వేద్భార్య, పిల్లలతో కలిసి కారులో వరంగల్‌నుంచి బయలుదేరి కూకట్‌పల్లి వస్తున్నాడు. శనివారం రాత్రి 12.30 సమయంలో వీరి కారు వివేకానందనగర్‌లోని అభి టిఫిన్సెంటర్వద్దకు రాగానే, వెనక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రుగ్వేద్ కూతురుకి స్వల్పంగా గాయపడింది. ప్రమాదానికి కారణమైన ఆనంద్(35)పై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.