
బెల్లంపల్లి, వెలుగు: ఇంట్లో సామాన్లు తరలిస్తుండగా కరెంట్ షాక్తో ఓ వ్యక్తి చనిపోయాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కర్రె శంకర్(55) ఇంటి షెడ్డులో ఉన్న కొంత సామగ్రిని తరలిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్ తెగిపడి అతడి చేతికి తగిలింది.
కరెంట్ షాక్‌కు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, ఓ కూతురు ఉన్నారు. సమాచారం అందుకున్న తాళ్ల గురిజాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. డెడ్‌బాడీని బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.