
చందానగర్, వెలుగు: తాగిన మత్తులో బాత్రూంలోని యాసిడ్‌తాగి ఓ వ్యక్తి చనిపోయాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు.. వేంకుంట ప్రాంతంలో టి.లక్ష్మణ్ భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు.మాదాపూర్‌లోని ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న లక్ష్మణ్ బాత్రూంలోకి వెళ్లి యాసిడ్‌ను మందు అనుకొని తాగేసాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11.30 గంటల సమయంలో లక్ష్మణ్ మృతి చెందాడు.