కాంప్రమైజ్ అంటే ఇదీ: రిటర్న్ తీసుకోని లేడీస్ లోదుస్తులు.. అలాగే ధరించి వెరైటీ నిరసన..

కాంప్రమైజ్ అంటే ఇదీ: రిటర్న్ తీసుకోని లేడీస్ లోదుస్తులు.. అలాగే ధరించి వెరైటీ నిరసన..

బ్లింకిట్. ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. కళ్లు మూసి తెరిచే లోపు ఆర్డర్ చేసిన వస్తువును తీసుకొచ్చి ఇస్తామని ఈ సంస్థ ప్రకటనలు కూడా గట్టిగానే ఇస్తుంది. క్విక్ కామర్స్ ప్లాట్ఫాం అయిన ఈ బ్లింకిట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఒకక వ్యక్తి అండర్వేర్ ఆర్డర్ చేశాడు. ఎంత అర్జెంట్గా అవసరం పడి ఆర్డర్ చేశాడో ఏంటో అని బ్లింకిట్ కూడా త్వరగానే ఆర్డర్ను సదరు వ్యక్తికి డెలివరీ చేసింది. కాకపోతే.. పురుషులు ధరించే అండర్వేర్ బదులుగా మహిళలు ధరించే ఇన్నర్వేర్ అయిన ప్యాంటీస్ను బ్లింకిట్ డెలివరీ చేసింది. ఆర్డర్లో వచ్చిన ప్రొడక్ట్ చూసి అవాక్కవడం ఆ యువకుడి వంతైంది. ఈ యువకుడికి చిర్రెత్తుకొచ్చింది. వీటిని ఎలా రిటర్న్ పెట్టాలో చెప్పాలని, తనకు ఇంతవరకూ రిఫండ్ రాలేదని చిర్రుబుర్రులాడాడు.

 

బ్లింకిట్ తనకు పంపించిన ప్రొడక్ట్ను ఫొటోలతో సహా ‘ఎక్స్’ ఖాతాలో ఈ యువకుడు పోస్ట్ చేశాడు. అయినప్పటికీ బ్లింకిట్ నుంచి తనకు ఎలాంటి రిఫండ్ అందలేదు. దీంతో.. ఆ యువకుడు ఊహించని విధంగా నిరసన తెలిపాడు. బ్లింకిట్ తనకు రిఫండ్ ఇవ్వడానికి నిరాకరించిందని, తాను కూడా ఇలా కాంప్రమైజ్ అవుతున్నానని.. బ్లింకిట్ పంపిన ఆ ప్యాంటీని ధరించి మరీ ఫొటో పెట్టి వెరైటీగా తన అసహనాన్ని, అసంతృప్తిని బయటపెట్టాడు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు నిజంగానే బ్లింకిట్ రిటర్న్ ప్రాసెస్ ఏమాత్రం బాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ‘ఎక్స్’ యూజర్లు ఈ యువకుడు పోస్ట్ చేసిన ఫొటోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ‘‘బ్రో మొత్తానికి సమస్య పరిష్కారానికి సరికొత్త విధానాన్ని ఎంచుకున్నాడు’’ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ వెరైటీ నిరసన నెట్టింట వైరల్ అయింది.