వాళ్ల తిక్క కుదిరింది : మున్సిపల్ ఆఫీసులోకి బల్లులు వదిలి.. తరువాత పాములతో వస్తానంటూ వార్నింగ్

వాళ్ల తిక్క కుదిరింది : మున్సిపల్ ఆఫీసులోకి బల్లులు వదిలి.. తరువాత పాములతో వస్తానంటూ వార్నింగ్

గవర్నమెంట్​ ఆఫీస్​లో పనులు అంటే ఎలా ఉంటాయ్​.. వేరే చెప్పాలా.. మీకూ అనుభవంలో ఉన్నవే కదా.. చిన్న పనికి పది సార్లు తిరగాలి.. చివరికి అవుతుందా అంటే గ్యారెంటీ లేదు. అవి కావాలి.. ఇవి కావాలి అంటూ.. కాళ్లరిగేలా తిప్పుతూ ఉంటారు. పని పూర్తి కావాలంటే మన విలువైన సమయాన్ని, శ్రమను అర్పించుకోవాల్సిందే. త్వరగా చేయిద్దామంటే అదీ సాధ్యం కాదు.  అయితే ఒకతను  ఆఫీస్​ల వెంట తిరిగి విసిగిపోయి ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. 

మధ్యప్రదేశ్​లోని చందేరిలో తోటారామ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. చందేరిలోని ప్రభుత్వ భూమిలో పాములు పట్టి జీవనం సాగిస్తున్నాడు. ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని అక్కడ ఇంటి నిర్మాణానికి డబ్బులు మంజూరు చేయాలని కోరుతూ పలుమార్లు మున్సిపల్​ ఆఫీసర్ల చుట్టూ తిరిగాడు.   ఎలాంటి స్పందన రాకపోవడంతో.. వారికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఓ మున్సిపల్​ అధికారి టార్గెట్ గా ఆఫీస్ కి వెళ్లి ఆయన టేబుల్​ దగ్గర అడవి బల్లిని వేశాడు. దాన్ని చూసిన సిబ్బంది ఒక్క సారిగా భయాందోళన చెందారు. వాళ్లు బతిమాలడంతో తోటరామ్​ దాన్ని పట్టుకున్నాడు. తన అభ్యర్థన వినకపోతే తరువాత పాములతో వస్తానని అధికారులను బెదిరించడం గమనార్హం.  అయితే ఆయన ఇంటి నిర్మాణానికి ఇప్పటికే రూ.లక్ష కేటాయించగా.. రూ.90 వేలు ఖర్చు చేసినట్లు మున్సిపల్​ అధికారులు తెలిపారు.