భలే ఐడియా : పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ గా హెల్మెట్స్

భలే ఐడియా : పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ గా హెల్మెట్స్

సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు ఎటువంటి బహుమతి ఇస్తాం.. హిందూ సంస్కృతిలో అయితే ఆడవారికి చక్కగా చీరసారెలు పెడతాం. మరికొందరు స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి ఇస్తుంటారు. ఎవరి స్తొమత బట్టి వారు గిఫ్టులనేవి ఇస్తుంటారు. ఇక బాగా డబ్బులు ఉన్న వారైతే వారి పెళ్లి గుర్తుండిపోవాలని వెండిఆభరణాలు సైతం గిఫ్టులుగా ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇవేవి కాకుండా ఓ వ్యక్తి మాత్రం  వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టాడు. 

రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఛత్తీస్‌గఢ్‌ కు చెందిన ఓ వ్యక్తి  తన కుమార్తె వివాహానికి అతిథులకు హెల్మెట్‌లను పంపిణీ చేశాడు.  వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ముదపర్ ప్రాంతానికి చెందిన సెడ్ యాదవ్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లికి వచ్చే అతిథులకు హెల్మెట్ ను గిఫ్టుగా ఇచ్చాడు. మోటార్ సైకిళ్లు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కల్పించడం కోసమే ఈ గిఫ్ట్ ఇచ్చానని తెలిపాడు. 

పెళ్లి జరుగుతున్నప్పుడు అతిథులు హెల్మెట్ ధరించి డీజే పాటలకు స్టెప్పులు చేశారు. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది క్షణాల్లోనే వైరల్ గా మారింది. సెడ్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు. చాలా మంచి పని అని కామెంట్స్ చేస్తున్నారు.