మందుబాబు హల్చల్.. ఫుల్గా తాగి ట్రాఫిక్ ఏఎస్ఐని ఢీ కొట్టాడు

 మందుబాబు హల్చల్..  ఫుల్గా తాగి ట్రాఫిక్ ఏఎస్ఐని ఢీ కొట్టాడు

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. ఫుల్ గా తాగి ఓవర్ స్పీడ్ తో బైక్ నడుపుతూ..  ట్రాఫిక్ ఏఎస్ఐ ఢీ కొట్టాడు. ఈ ఘటన డైరీ ఫార్మ్ చౌరస్తా నుండి రాజేంద్రనగర్ వెళ్తున్న  దారిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రాఫిక్ ఏఎస్ఐ నూరుద్దీన్ కాలు ఫ్యాక్చర్ అయింది. 

వెంటనే ఆయన్ను 108  అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కు తరలించారు. ఆ మందుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనికి  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 400 గా చూపించింది.  డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్  డ్రైవింగ్ కింద కేసు బుక్  చేశారు  పోలీసులు.