
హైదరాబాద్ : తల్లి తిట్టిందని ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్, బోయిన్ పల్లిలో జరిగింది. చింతల్ గణేష్ నగర్ కు చెందిన వివేక్ తన తల్లి మందలించిందని మనస్తాపంతో రెండు రోజుల నుంచి ఇంటికి వేళ్ళలేదు. ఇవాళ తన స్నేహితుడు శివకు వీడియో కాల్ చేసి పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.