
హైటెక్ యుగంలో రాను రాను జనాలు ఏం చేస్తున్నారో అర్దం కావడం లేదు. ఊ .. అన్నా..ఆ ... అన్నా.. కోపం కట్టలు తెంచుకుంటుంది. వారు చెప్పిన పని చేయకపోతే ఎంత దారుణానికి అయినా తెగిస్తున్నారు. అది మంచైనా.. చెడైనా సరే.. చెప్పినట్టు వినలేదా.. ఇక అంతే.. అయితే తాజాగా .. ఓ వ్యక్తి మద్యం తాగలేదని డాబాపై నుంచి తోసేసిన ఘటన చోటు చేసుకుంది.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే....
ఉత్తర్‌ప్రదేశ్ లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మందు తాగలేదని మద్యం అమ్ము వ్యక్తిని డాబా మీద నుంచి తోసేశారు. ఈ వార్త చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. లక్నో లో రంజిత్ సింగ్ అనే వ్యక్తి మద్యం అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడి దగ్గర మద్యంతో పాటు భోజనం కూడా లభిస్తుండటంతో అక్కడికి చాలా మంది మద్యం కొనేందుకు వస్తుంటారు. కొంతమంది భోజనంకూడా చేసి వెళ్తుంటారు.
ఈ క్రమంలో మే 24వ తేదీన రాత్రిపూట నలుగురు వ్యక్తులు ఆ డాబాకు వచ్చి మద్యం తాగుతున్నారు. వచ్చిన వాళ్లు తాగి వెళ్లిపోకుండా ... మద్యం మత్తులో కంట్రోల్ తప్పిన వారు .. రంజిత్ సింగ్‌ను కూడా మందు తాగమన్నారు. అయితే అందుకు అతడు నిరాకరించాడు. దీంతో వారు రంజిత్ సింగ్ పై సీరియస్ అయ్యారు.అప్పుడు ఆయప వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వాళ్లను హెచ్చరించాడు.
మందు తాగలేదని వ్యక్తిని డాబాపై నుంచి తోసేసి కొట్టారు
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2024
ఉత్తరప్రదేశ్ - లక్నోలో రంజిత్ సింగ్ అనే వ్యక్తి మద్యం అమ్మేవాడు.. ఇదే క్రమంలో 24వ తేదీ రాత్రిపూట మందు తాగడానికి వచ్చిన నలుగురు వ్యక్తులు రంజిత్ సింగ్‌ను కూడా మందు తాగమన్నారు.
దీనికి రంజిత్ సింగ్ నిరాకరించి వాళ్ళని డాబాపై… pic.twitter.com/zslJXBDenm
తమనే వెళ్లిపొమ్మంటావా అంటూ .. వాళ్లు ఆగ్రహం రంజిత్ సింగ్ పై గొడవకు దిగారు. మద్యం మత్తులో రంజిత్ సింగ్‌పై దాడి చేసి అతడ్ని కొట్టారు. ఆ తర్వాత డాబా మీద నుంచి కిందకు తోసేశారు. రంజిత్ సింగ్ పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇలాంటి వాళ్లను అస్సలు వదిలిపెట్టొద్దని కోరుతున్నారు. శిక్ష పడుతుందనే భయం ఉంటే ఇలాంటివి చేయరని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో నేరాలు పెరిగిపోవడానికి మనుషుల ప్రవర్తనల్లో వస్తున్న అనూహ్యమైన మార్పులు కూడా కారణం అవుతున్నాయి. చిన్న విషయాలకు కూడా ఇతరులపై కోపగించుకోవడం, దాడి చేయడం ఇప్పుడు పెరిగిపోయింది. ఒక్కోసారి ఆగ్రహంలో తమ మీదే తామే దాడి చేసుకుంటున్నారు. ఇలా కోపంలో కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడా ఇక్కడా అనే తేడాల్లేవు.. చాలా చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తాగిన మత్తులో చేసిన గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి వార్తల్లో చూస్తేనే ఉన్నాం. ఇలాంటి ఘటనల్లో అమాయకులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.