
శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. సోమవారం సెట్ లొకేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా అరవింద్ కృష్ణ మాట్లాడుతూ ‘ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా రూపొందుతోంది’ అని చెప్పాడు.
జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ ‘మైథాలజీని, సూపర్ హీరో జానర్‌ను కలిపి ఒక గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు పూర్వాజ్. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఉంటుంది. కెరీర్‌లో నటిగా సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. దర్శకుడు పూర్వజ్ మాట్లాడుతూ ‘శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా కథే ఈ చిత్రం. అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా కనిపిస్తారు. మహాశివరాత్రికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నాడు. షూటింగ్‌తో పాటు వీఫ్ఎక్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాతలు మనీష్ గిలాడ, యోగి పోసాని అన్నారు.