ముదురుతున్న బాషా వివాదం : "హిందీ మాట్లాడుతా" అన్నందుకు ఆటో డ్రైవర్‌ను కొట్టారు..

ముదురుతున్న బాషా వివాదం :  "హిందీ మాట్లాడుతా" అన్నందుకు ఆటో డ్రైవర్‌ను కొట్టారు..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో మరాఠీ భాష వివాదం ముదురుతోంది. గతంలో జరిగిన ఓ ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి), రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు  ఓ ఆటో డ్రైవర్‌పై బహిరంగంగా కొట్టి దాడి చేశారు.

కొన్ని రోజుల క్రితం విరార్ స్టేషన్ వద్ద ఉత్తరప్రదేశ్ వాసి భవేష్ పడోలియా అనే వ్యక్తికి అలాగే మహారాష్ట్రకి వలస వచ్చిన ఆటో రిక్షా డ్రైవర్ కు మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరాఠీలో ఎందుకు మాట్లాడటం లేదని  భవేష్ పడోలియా అడిగినప్పుడు రిక్షా డ్రైవర్ "మై హిందీ బోలుంగా" (నేను హిందీలో మాట్లాడతాను) అని చెప్ప్పడం వీడియోలో కనిపిస్తుంది. భవేష్ పడోలియా కథనం ప్రకారం, మరాఠీలో మాట్లాడకపోవడం గురించి అతను డ్రైవర్‌ను ప్రశ్నించాడు. డ్రైవర్ తాను హిందీ, భోజ్‌పురిలోనే మాట్లాడతానని సమాధానం ఇచ్చాడు. 

గత శనివారం అదే విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో శివసేన (UBT), MNS కార్యకర్తలకి  రిక్షా డ్రైవర్‌ ఎదురవగా డ్రైవర్‌ను చెంపదెబ్బలు కొడుతూ  దాడి చేసారు, వీరిలో ఒక మహిళా కూడా ఉంది. దాడి చేసినవారు మరాఠీ భాష, సాంస్కృతిని అవమానించాడని, దింతో అతనితో మహారాష్ట్ర రాష్ట్రానికి బహిరంగంగా క్షమాపణ చెప్పించారు. 

శివసేన (UBT) విరార్ నగర చీఫ్ ఉదయ్ జాదవ్  కార్యకర్తలు నిజమైన శివసేన స్టయిల్లో  స్పందించిందని అన్నారు. అలాగే ఎవరైనా మరాఠీ భాషను, మహారాష్ట్రను లేదా మరాఠీ ప్రజలను అవమానించడానికి ధైర్యం చేస్తే, వారికి నిజమైన శివసేన పద్దతిలో  సమాధానం వస్తుంది. మేము మౌనంగా కూర్చోము అని ఉదయ్ జాదవ్ అన్నారు. 

పోలీసులకు ఫిర్యాదు : ఈ దాడి బహిరంగంగా జరిగిన కూడా పాల్ఘర్ జిల్లా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీనిపై వైరల్ వీడియోను మేము చూశాము, వాస్తవాలను పరిశీలిస్తున్నాము, కానీ ప్రస్తుతానికి మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు అని పోలీసులు తెలిపారు. 

మహారాష్ట్రలో భాషా రాజకీయాల వల్ల జరిగిన దాడుల్లో ఇదొక కొత్త సంఘటన. జూలై 1న థానేలోని MNS కార్యకర్తలు మరాఠీలో మాట్లాడలేదని ఒక చిరు వ్యాపారిని చెంపదెబ్బ కొట్టారు. ఆ సంఘటన కూడా విమర్శలకు దారితీసింది అలాగే  ఏడుగురు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసారు. మరోవైపు భయాందర్‌లోని వ్యాపారులు MNS కార్యకర్తలు మోరల్ పోలీసింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన చేసారు.