పాతబస్తీ సుల్తాన్ షాహీలో బాలుడిపై కాల్పులు

పాతబస్తీ సుల్తాన్ షాహీలో బాలుడిపై కాల్పులు

హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహీలో ఓ బాలుడిపై కాల్పులు కలకలం రేపాయి. ఈ నెల 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొగల్ ఫురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహిలో బాలుడిపై అప్సర్ అనే ఫైనాన్షియర్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ బాలుడికి బహదూర్ పురాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే.. ఈ కాల్పులు మిస్ ఫైర్ కారణంగానే అయినట్టు తెలుస్తోంది.

మూడేళ్ళ క్రితం అఫ్సర్ అబిడ్స్ లో ఎయిర్ గన్ కొనుగోలు చేశాడని, ఇటీవల ఆ గన్ తో కుక్కలను ఫైర్ చేసి, అనంతరం ఇంట్లో ఉన్న బల్లులను ఎయిర్ గన్ తో షూట్ చేసే క్రమంలో గురి తప్పి.. బాలుడికి తాకిందని సమాచారం. ఈ ఘటనలో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది.