కారుపై పడ్డ బండరాయి: హీరోయిన్ కి తప్పిన ప్రమాదం

కారుపై పడ్డ బండరాయి: హీరోయిన్ కి తప్పిన ప్రమాదం

హీరోయిన్ మౌనిరాయ్ కి పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై పెద్ద బండరాయి వచ్చి పడింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం ముంబైలో జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మౌనిరాయ్..జుహు ప్రాంతంలో రెడ్ సిగ్నల్ పడటంతో కారు ఆపింది. అంతలోనే ఆమె కారు ముందుభాగంపై ..11 అంతస్తుల అపార్ట్ మెంట్ నుంచి ఓ పెద్ద బండరాయి పడింది. ఎవ్వరికీ ప్రమాదం జరగనప్పటికీ.. కారు ముందుభాగం డ్యామేజ్ అయ్యింది. కొంచెం అటు ఇటు అయినా హీరోయిన్ కు పెద్ద ప్రమాదం జరిగేది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన మౌనిరాయ్..బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన వారిపై సీరియస్ అయ్యింది. ఒకవేళ నా కారుపైన కాకుండా.. ఈ దారి వెంట వెళ్ళే ఎవరిపైనైనా పడుంటే పరిస్థితి ఏంటి? ముంబై మెట్రో పనులు ఎంత బాధ్యతారహిత్యంగా కొనసాగుతున్నాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ’’ అని ట్వీట్ చేసింది.

మౌనిరాయ్ గోల్డ్‌, బ్ర‌హ్మ‌స్త్రా త‌దిత‌ర సినిమాల్లో నటించింది.