కరెంట్​ సరఫరా సమస్యల పరిష్కారానికి మొబైల్ యాప్​

కరెంట్​ సరఫరా సమస్యల పరిష్కారానికి మొబైల్ యాప్​

మెదక్​, వెలుగు: టీజీఎస్పీడీసీఎల్ నెట్​వర్క్​ సర్వే కోసం మొబైల్ యాప్​ తయారు చేసినట్టు శనివారం ట్రాన్స్​కో మెదక్ జిల్లా సూపరింటెండెంట్​ ఇంజనీర్​ జానకి రాములు తెలిపారు. ట్రాన్స్​ఫార్మర్లు, కరెంట్​ తీగలు, ఫీడర్ల పని తీరు వివరాలను ఈ యాప్ ద్వారా రికార్డు చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి అధికారికంగా ఈ ప్రక్రియ ప్రారంభిస్తునట్లు చెప్పారు. 

మొదటి దశలో విద్యుత్ లైన్లు సర్వే పనులను చేపడుతున్నామని, మెదక్ టౌన్ పరిధిలో ఉన్న 10 ఫీడర్లను మొబైల్ యాప్​ ద్వారా జీపీఎస్​తో అనుసంధానిస్తామన్నారు. ప్రస్తుతం విద్యు త్ నెట్​వర్క్​ మ్యానువల్ గా ఉందని, ఈ ఆప్ ద్వారా సమస్యను సులభంగా గుర్తించే వీలుందని తెలిపారు.