శ్రీలంకలో మరింత ముదిరిన ఆర్థిక సంక్షోభం

శ్రీలంకలో మరింత ముదిరిన ఆర్థిక సంక్షోభం

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. గో టూ హోం రాజపక్స నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీలంకలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో గొటబాయ రాజపక్స అధికారం నుంచి వైదొలగాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో సర్కార్ పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ధరలతో పెట్రోల్, డీజిల్ కొనలేక.. కరెంట్ కోతలు తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. 

మరోవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. అఖిలపక్ష సర్కార్ దిశగా గొటబాయ రాజపక్స అడుగులు వేస్తున్నారు. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. బుధవారం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసిన రాజపక్స.. ప్రభుత్వంలోకి అన్ని పార్టీలను ఆహ్వానించారు. రేపు దీనిపై మరింత చర్చించనున్నట్లు తెలిపారు. సంక్షోభ సమయంలో అందరం కలిసికట్టుగా పని చేయాలని ప్రతిపక్షాలను రాజపక్స కోరుతున్నారు. 

సంక్షోభం నుంచి బయటపడేందుకు తమ దేశానికి తక్షణమే రూ. 30,400 కోట్లు కావాలని శ్రీలంక అంచనా వేస్తోంది. అప్పు ఇవ్వాలని శ్రీలంక ప్రభుత్వం IMF, భారత్ తో పాటు మరికొన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది. శ్రీలంక ఆర్థికశాఖ మంత్రి అలీ సబ్రే నేతృత్వంలోని బృందం అమెరికాలోని IMF ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. దీంతో అప్పులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. శ్రీలంకకు మొదటి నుంచి అండగా ఉంటున్న భారత్.. తన సాయాన్ని మరింత పెంచింది. చమురు దిగుమతి చేసేందుకు రూ.3,800 కోట్ల విలువైన క్రెడిట్ లైన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. 

మరిన్ని వార్తల కోసం..

దేశానికి కావాల్సింది ఫ్రంట్లు​ కాదు..కొత్త ఎజెండా

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు కోహ్లీ దూరం!