
ఊట్కూర్, వెలుగు: పుట్టింటికి వస్తానని తండ్రితో చెప్పి అత్తారింటి నుంచి బయల్దేరిన తల్లీబిడ్డ చెరువులో శవమై తేలారు. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణపేట మండలం సింగారం గ్రామానికి చెందిన రజిత(24)కుదామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామానికి చెందిన కనకప్పతో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ నెల 23న పుట్టింటికి వస్తున్నానని తండ్రికి చెప్పిన రజిత కూతురు శ్రీలత(01)ను తీసుకొని బయల్దేరింది. సాయంత్రం అయినా ఊరికి రాకపోవడంతో తండ్రి చంద్రప్ప 24న నారాయణ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం ఊట్కూర్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి చెరువులో తల్లీబిడ్డలు శవాలుగా తేలడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం నారాయణపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని, డెడ్‌బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై పర్వతాలు తెలిపారు.