నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 4 శాతం తగ్గిన నేరాలు : సీపీ సాయి చైతన్య

నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 4 శాతం తగ్గిన నేరాలు   :  సీపీ సాయి చైతన్య
  • పెరిగిన రేప్‌‌‌‌, పోక్సో కేసులు
  • రూ.15.29 కోట్ల సైబర్‌‌‌‌ మోసాలు
  • 3.51 లక్షల ట్రాఫిక్‌‌‌‌ ఉల్లంఘనలు
  • డయల్​ 100కు 53,776 కాల్స్​
  • అదుపులోకి వచ్చిన రోడ్​ యాక్సిడెంట్స్​

నిజామాబాద్‌‌‌‌, వెలుగు :   గతేడాదితో పోలిస్తే 2025లో నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో నేరాలు 4 శాతం తగ్గినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు.  మంగళవారం జిల్లా పోలీస్‌‌‌‌ కమాండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌లో వార్షిక క్రైమ్‌‌‌‌ వివరాల బుక్‌‌‌‌లెట్‌‌‌‌ను విడుదల చేశారు. మహిళలు, బాలికలపై లైంగికదాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య అదుపులోకి రాగా, ట్రాఫిక్‌‌‌‌ ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారన్నారు. మరోవైపు సైబర్‌‌‌‌ మోసాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఆపదలో పోలీసుల సాయం కోరుతూ ఈ ఏడాది డయల్‌‌‌‌-100కు 53,776 కాల్స్‌‌‌‌ వచ్చినట్లు   సీపీ తెలిపారు.  

8,624 కేసులు నమోదు..

గత సంవత్సరం జిల్లాలో 8,983 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 8,624 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆర్గనైజ్డ్‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌ 6,723 ఉన్నాయి. కొట్లాటల ఘటనల్లో 1,729 మంది గాయపడగా, వారిలో 58 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గతేడాది 1,397 ఆస్తినష్టం కేసులు నమోదు కాగా, ఈ ఏడాది అవి 1,240కు తగ్గాయి. వీటిలో 66 కేసుల్లో భారీ నష్టం వాటిల్లింది. 

సీసీఎస్‌‌‌‌ పోలీసులు 75 మంది నిందితులను అరెస్ట్​చేసి రూ.67.73 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు. జిల్లాలో 50 హత్యలు, 101 హత్యాయత్న కేసులు, 8 హోమిసైడ్‌‌‌‌ ఘటనలు, 165 కిడ్నాప్‌‌‌‌లు, 758 చీటింగ్‌‌‌‌ కేసులు నమోదయ్యాయి. 

మహిళలు, మైనర్లే లక్ష్యం 

ఈ ఏడాది జిల్లాలో మహిళలు, మైనర్లు కలిపి 783 మంది వివిధ నేరాల్లో బాధితులయ్యారు. వరకట్న హత్యలు జరగకపోయినా, వరకట్న వేధింపులతో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇతర కారణాలతో 25 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. రేప్‌‌‌‌ కేసులు 89గా నమోదు కాగా, మహిళల కిడ్నాప్‌‌‌‌ కేసులు 135కి పెరిగాయి. 210 మంది మహిళలు గౌరవభంగానికి గురవగా, 322 మంది వేధింపులు ఎదుర్కొన్నారు. మైనర్లపై అఘాయిత్యాలు లేదా అఘాయిత్యానికి ప్రయత్నించిన కేసులు 168 నమోదయ్యాయి.

ఆర్థిక హత్యలు 11.. 

జిల్లాలో 21 రాబరీలు, 5 డకాయిటీ కేసులు నమోదయ్యాయి. డబ్బులు, నగల కోసం 11 హత్యలు జరిగాయి. 39 చైన్‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌ కేసులు, 439 ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు, 394 వాహనాల చోరీలు, ఇతర దొంగతనాలు 134, కరెంట్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు ఎత్తుకెళ్లిన కేసులు 120 నమోదయ్యాయి. బలమైన సాక్ష్యాలతో 121 కేసుల్లో 219 మంది నిందితులకు కోర్టు శిక్ష విధించింది. వీరిలో 20 మందికి జీవిత ఖైదు పడింది. 

క్రైం                  2024          2025

హత్యలు             43           50
హత్యాయత్నం  62          102
కిడ్నాప్​లు         126       165
రేప్​ కేసులు       83           89
ఫొక్సో                120         168
సైబర్​ నేరాలు 2339      2532
ట్రాఫిక్          2,56,056     3,51,996
ఉల్లంఘనలు