
భర్త తనను పట్టించుకోవడం లేదని ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపేసింది ఓ తల్లి. పిల్లలిద్దర్ని బీరు సీసాతో పొడిచిన ఆ తల్లి..చనిపోయారా? లేదా అనే అనుమానంతో మరోసారి కత్తితో పొడిచి చంపేసింది. తాను కూడా చనిపోవాలనుకుని ధైర్యం సరిపోకపోవడంతో చివరకు పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కరీంగనగర్ జిల్లాకు చెందిన చింతల సరోజ సిద్దిపేట జిల్లాకు చెందిన చిట్యాల భాస్కర్ అనే ఆటో డ్రైవర్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరికి అయాన్(5),హర్షవర్దన్(2) ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య భర్తలకు ఇద్దరికి తరచూ గొడవలు అయ్యేవి. భర్త తనను సరిగా చూసుకోవడం లేదని సరోజ భర్తను నిలదీసేది. ఈ విషయంపై పదే పదే గొడవ పడేవారు. ఎంత చెప్పినా వినకపోవడంతో భర్తపై కోపం పెంచుకున్న సరోజ ఇద్దరు పిల్లలను బీరు సీసాతో పొడిచింది. చనిపోయారా? లేదా? అనే అనుమానంతో కత్తితో మరోసారి పొడిచింది. తర్వాత తాను కూడా చనిపోవాలనుకుని మానేరు డ్యాంకు వెళ్లింది. అక్కడ కూడా ధైర్యం చాలక కరీంనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది.