రూ. కోటి సాలరీతో ఎలుకలు పట్టే ఉద్యోగం 

రూ. కోటి సాలరీతో ఎలుకలు పట్టే ఉద్యోగం 

న్యూయార్క్ లో ఒక కొత్త ఉద్యోగానికి ఖాళీలు ఉన్నట్లు ప్రకటన విడుదలైంది. ఏసీ ఆఫీసులో ఉద్యోగం. సాలరీ కూడా సంవత్సరానికి కోటీ 38 లక్షల 55 వేల రూపాయలు. కాకపోతే చేయాల్సిన పనే కొంచెం వింతైంది. అదేంటంటే.. ఇండ్లు, ఆఫీస్ రూమ్స్ లో ఉన్న ఎలుకల్ని పట్టుకోవడం. ఈ వింత పోస్ట్ ని విడుదల చేసింది న్యూయార్క్ లోని మేయర్ ఎరిక్ ఆడమ్స్. ఆ ఉద్యోగానికి ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ అని పేరుపెట్టాడు.

ఈ ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్ కి గల కారణం వివరిస్తూ ఆడమ్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తనకు ఎలుకలంటే అసహ్యమని చెప్తూ, న్యూయార్క్ లో మనుషుల కంటే ఎలుకల జనాభా పెరిగిపోతుంది. ఇండ్లు, ఆఫీసుల్లో వాటి బెడదవల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యను తగ్గించడానికి ఈ పోస్ట్ రిలీజ్ చేశానని పేర్కొన్నాడు. క్వాలిఫికేషన్స్ వివరిస్తూ అభ్యర్తికి నాయకత్వ లక్షణాలు, దీర్ఘదృష్టి, ఎలుకల్ని పట్టుకునే సామర్థ్యం ఉండాలని తెలిపాడు.