- టీజీ ఎన్పీడీసీఎల్ లో ఒక్కరోజే 6,457 మెగావాట్ల నమోదు
హనుమకొండ, వెలుగు: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డు నమోదైంది. గురువారం 6,457 మెగావాట్ల కరెంట్ డిమాండ్ నమోదైనట్లు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు.
సంస్థ చరిత్రలో ఇదే అత్యధిక డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 3న 6,441 మెగావాట్ల డిమాండ్ నమోదవగా, గురువారం మరో 16 మెగావాట్లు పెరిగి కొత్త రికార్డు నమోదైందన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోందని చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, అయినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమని సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు.
