కొడుకులు అన్నం పెడతలేరు.. వికారాబాద్ ఆర్డీవోకు గోడు వెళ్లబోసుకున్న వృద్ధురాలు

కొడుకులు అన్నం పెడతలేరు.. వికారాబాద్ ఆర్డీవోకు గోడు వెళ్లబోసుకున్న వృద్ధురాలు
  • నోటికొచ్చినట్లు తిడుతూ కొడుతున్నరు

వికారాబాద్, వెలుగు: ఆస్తి పంచుకుని కొడుకులు తనకు  అన్నం పెట్టకపోవడమే కాకుండా రోజూ నోటికొచ్చినట్లు తిడుతూ కొడుతున్నారని ఓ వృద్ధురాలు ఆర్టీవోకు గోడు వెళ్లబోసుకుంది. వికారాబాద్​జిల్లా ధారూర్​ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన గౌసియా బేగంకు ఇద్దరు కొడుకులు ఉండగా, సమానంగా ఆస్తి, డబ్బులను పంచి ఇచ్చింది. అయితే, తన వద్ద ఉన్న ఆస్తి, డబ్బులు తీసుకుని కొడుకులు అన్నం పెట్టడం లేదని బుధవారం వికారాబాద్​లోని ఆర్డీవో  కార్యాలయానికి వచ్చింది. అక్కడ ఉన్న ఆర్డీవో వాసుచంద్రతో తన గోడు వెళ్లబోసుకుని కన్నీటి పర్యంతమైంది. తన పెద్ద కొడుకు మహ్మద్ తనను చిత్రహింసలుపెడుతున్నాడని, తినడానికి అన్నం పెట్టకుండా దుర్భాషలాడుతూ కొడుతున్నాడని తెలిపింది. దీనిపై స్పందించిన ఆర్డీవో.. గౌసియా బేగం కొడుకులిద్దరికి నోటీసులు ఇచ్చి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.