కుక్క దాడిలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

కుక్క దాడిలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

హైదరాబాద్ బంజారా హిల్స్ లో విషాదం నెలకొంది. స్విగ్గీ  డెలివరీ చేసేందుకు వెళ్లిన   డెలివరీ బాయ్ పై పెంపుడు కుక్క దాడి చేయడంతో  రిజ్వాన్ అనే యువకుడు మృతి చెందాడు.  జర్మన్ షెపర్డ్ నుండి తప్పించుకునేందుకు యత్నించి మొదటి అంతస్తు పై నుంచి జారిపడ్డాడు.  తలకు తీవ్రగాయాలు కావటం తో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. 


డెలివరీ బాయ్ రిజ్వాన్ తలకు బలమైన గాయాలు కావడంతో గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలో కోమాలో ఉన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇంటి ఓనర్ శోభన పై కేసు నమోదు చేశారు  పోలీసులు. డెలివరీ బాయ్ పై కుక్క దాడిచేసిందా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బంజారా హిల్స్ లుంబిని రాక్ కేసిల్ అపార్ట్మెంట్ జిఎఫ్ 7 లో జరగింది.