గురుకుల హాస్టల్స్లో కనీస సదుపాయాలు ఎందుకు లేవు : తెలంగాణ హైకోర్టు

గురుకుల హాస్టల్స్లో కనీస సదుపాయాలు ఎందుకు లేవు : తెలంగాణ హైకోర్టు

తెలంగాణలోని రెసిడెన్షియల్ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవుతున్నాయని, సరైన సదుపాయాలు లేవంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని పలు గురుకుల హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి.. చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని హైకోర్టులో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పిల్ వేశారు. పిల్లల ప్రాణాల రక్షణకు చర్యలు చేపట్టాలని పిటిషన్ లో కోరారు.

నాగర్‌ కర్నూల్ జిల్లా మన్ననూర్, మోర్తాడ్, హుజురాబాద్, మంచాలలో అధికారులు స్టూడెంట్స్ కు కలుషిత ఆహారాన్ని అందించారని పిటిషన్ లో తెలిపారు. 300 స్టూడెంట్స్ కడుపునొప్పి, తలనొప్పి, ఫుడ్ పాయిజన్‌తో తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. గురుకుల హాస్టల్స్ లో సరైన సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రెండు వారాల్లోగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్ లో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. గురుకుల హాస్టల్స్ స్టేటస్ పై రెండు వారాల్లోగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కోరింది. ఇదే ఇష్యూపై విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.