ఖైరతాబాద్ గణపతిని  దర్శించుకున్న కవిత

ఖైరతాబాద్ గణపతిని  దర్శించుకున్న కవిత
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఖైరతాబాద్ గణపతిని ఈసారి ఎకో ఫ్రెండ్లీ గణేశ్ గా ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేష్ అంత ఎత్తు, ఆకారం ఎలా వుంటుందనిసంవత్సరకాలంగా ఎదురు చూస్తూ ఉంటామన్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని కొంగు బంగారంగా భావిస్తూ ఉంటామని కవిత చెప్పారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వినాయకుని పూజించానని.. కరోనా మహమ్మారిఇకముందు మన దరిదాపులకు రాకుండా ఉండాలని ఆ వినాయకుడిని పూజిద్దామన్నారు. మత సామరస్యాలకి ప్రతీక హైదరాబాద్ నగరమని.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని కోరుకున్నానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.