ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. నుజ్జునుజ్జయిన కారు

ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. నుజ్జునుజ్జయిన కారు

విజయనగరంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్ జంక్షన్ సర్కిల్ వద్ద అదుపుతప్పి ఓ కారు ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారును బస్సు వేగంగా ఢీకొనడంతో బస్సు ముందు భాగంలో కూర్చొన్న ప్రయాణికులు కూడా ఎగిరి బయటకు పడ్డారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన జరగ్గానే తీవ్ర భయాందోళనకు లోనైన బస్సు డ్రైవర్‌ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కారులో ఇరుక్కుపోయిన వారిని స్థానికులు అతికష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుప‌త్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.