విశాఖ ఇండస్ట్రీస్ కు ‘నేషనల్ అచీవర్స్ రీకగ్నైజేషన్ ఫోరం అవార్డు’

విశాఖ ఇండస్ట్రీస్ కు ‘నేషనల్ అచీవర్స్ రీకగ్నైజేషన్ ఫోరం అవార్డు’

ప్రముఖ కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్ కు ‘నేషనల్ అచీవర్స్ రీకగ్నైజేషన్ ఫోరం అవార్డు’ లభించింది. మిషన్ వీ కాన్సెప్ట్ కు ‘బెస్ట్ క్రియేటీవ్ బ్రాండ్ అవార్డు వరించింది. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఎంపీ తిరత్ సింగ్ రావత్ చేతుల మీదుగా.. గురువారం (డిసెంబర్ 7న) విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్రియేటీవ్ డైరెక్టర్ డా. సిద్దేశ్వర్ మనోజ్, బిజినెస్ హెడ్ సునీల్ అవార్డు అందుకున్నారు.

మిషన్ వీ కాన్సెప్ట్ కు బెస్ట్ క్రియేటీవ్ బ్రాండ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు బిజినెస్ హెడ్ సునీల్. వీటితో పాటు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా  విశాఖ టీమ్ ను వరించడం మరో విశేషం. ‘ఇన్ హౌజ్’లో విశాఖ రూపొందించిన కాన్సెప్ట్ కు అవార్డు రావడం అనేది బిగ్ అచీవ్ మెంట్ అని చెప్పారు. ఇలాంటి కాన్సెప్ట్ లకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా అరుదని వివరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డు అందుకోవడం తమ టీమ్ మెంబర్స్ కు గర్వంగా ఉందని తెలిపారు. 

భవన నిర్మాణాల్లో ప్రతి సంవత్సరం కోట్లాది చెట్లను నరికేస్తున్నారని, ఆ చెట్లను నరకకుండా విశాఖ టీమ్ గో –గ్రీన్ నినాదంతో వీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ను రూపొందించిందని క్రియేటివ్ డైరెక్టర్ డా సిద్దేశ్వర్ మనోజ్ చెప్పారు. పర్యావరణాన్ని కాపాడేందుకు వీ నెక్ట్స్ ను లాంచ్ చేశామని వివరించారు. ఈ కాన్సెప్ట్ ను మెఘాలయలో చిత్రీకరించామని తెలిపారు. చెట్లను సేవ్ చేస్తూ..  ప్లాస్టిక్ ను నిర్మూలించేలా కాన్సెప్ట్ రూపొందించామన్నారు. 

ఈ కాన్సెప్ట్ రూపకల్పనలో విశాఖ యాజమాన్యం, ముఖ్యంగా చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీ. వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీ కృష్ణ, సునీల్ అన్ని విధాలుగా సహకారం అందించారని తెలిపారు. ప్రతి నెల ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రజల ముందుకొచ్చెలా ప్లాన్ చేస్తున్నామన్నారు.