సందడి చేసిన అరుదైన పక్షి

సందడి చేసిన అరుదైన పక్షి

 నిర్మల్  జిల్లా పెంబి మండలంలోని తాటిగూడ చెరువులో మంగళవారం ఉదయం అరదైన పక్షి సందడి చేసింది. ఈ పక్షి చిన్న ఫ్లెమింగో జాతికి చెందిందని డిప్యూటీ రేంజ్  ఆఫీసర్  ప్రతాప్ నాయక్  తెలిపారు. ఈ పక్షులు సాధారణంగా సముద్ర తీర ప్రాంతాలు, ఉప్పు నీటి మడుగుల వద్దకు వలస వెళ్తాయని పేర్కొన్నారు. 

ఈ చిన్న ఫ్లెమింగోలు మన దేశంలో ఎక్కువగా గుజరాత్ లోని ఆఫ్  కచ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పులికాట్  సరస్సు ప్రాంతాల్లో కనబడతాయని తెలిపారు. ఈ పక్షులు పెంబి మండలంలో కనబడడంతో పక్షి ప్రేమికులు అక్కడికి వెళ్లి వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.