
తిరుమల తిరుపతి కొండలకు అరుదైన గౌరవం దక్కింది. సహజ వారసత్వ సంపదగా ప్రసిద్ధికెక్కిన తిరుమల కొండలు, భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని ఏడు ఆస్తులు యునెస్కో గుర్తింపుకు చేరువయ్యాయి. ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం రూపొందించిన తాత్కాలిక జాబితాలో వీటికి చోటు లభించింది. ఈ విషయాన్ని ఆదివారం యునెస్కో తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం రూపొందించిన తాత్కాలిక జాబితాలో వాటికి చోటు లభించింది. గుర్తింపు కోసం లిస్టులో చోటు చేసుకున్న వాటిలో మహారాష్ట్రలోని పంచగాని, కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు (ఈస్ట్ ఖాసి హిల్స్), మహాబలేశ్వర్ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్స్, కేరళలోని వర్కాల సహజ వారసత్వ సంపద, నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్ తదితరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని యునెస్కో తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఏడుతో కలిపి ఇప్పటివరకు తాత్కాలిక జాబితాలో చోటు లభించిన వాటిలో మనదేశం నుంచి 69 అంశాలు ఉండటం గమనార్హం
తిరుమల తిరుపతి ఏడు కొండలకు సంబంధించి పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే నేడు తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులుగా రూపాంతరం చెందాయని ప్రతీతి. ఆ ఏడు శిఖరాలను అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి గా పిలుస్తారు. ఏడు కొండలను పవిత్ర గిరులుగా పరిగణిస్తారు. ఆ కొండలకు ఒక్కొక్కదానికి ఒక్కో చరిత్ర ఉంది.
ఈ కొండల గురించి 1830 లో యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి విశేషాలను రాశారు. ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయతతో కూడిన తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి నెలవని చెప్పాలి. అరుదైన వృక్ష, జంతుజాతులకు ఈ కొండలు ఆలవాలం.
ఇక్కడి వాతావరణం కూడా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే వైవిధ్యం. బాహ్య ప్రపంచానికి భిన్నంగా కొండలపై నిరంతరం శీతల పవనాలు వీస్తుంటాయి. తరచూ వర్షపు జల్లులు కురుస్తుంటాయి. అనేక జలపాతాలు కనివిందు చేస్తాయి. ఎందరో రుషులు, మునులు తపస్సునాచరించిన చారిత్రక ఆనవాళ్లు కొండలపై కనిపిస్తాయి. ఇక్కడి తీర్థక్షేత్రాలపై ఎన్నో గాథలు నేటికి ప్రచారంలో ఉన్నాయి.
ఇక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా-లో చోటు దక్కిన విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలకూ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం సినిమా షూటింగ్‌లకు నెలవు. తుది జాబితాలో చోటు దక్కితే.. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ మరింత పకడ్బందీగా చేయడానికి అవకాశం ఉంటుంది.భీమిలి తీరానికి 200 మీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 10 నుంచి 90 మీటర్ల ఎత్తులోఈ ఎర్రమట్టి దిబ్బలున్నాయి.
ఈ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా గాలులకు ఎగురుతూ వచ్చిన ఇసుక రేణువులు ఒక్కచోటుకి చేరి దిబ్బలుగా మారినట్లు చెప్తారు. ఇందుకు భౌగోళికంగా చోటుచేసుకున్న కొన్ని వాతావరణ మార్పులు అనుకూలించినట్లు తెలుస్తోంది. దాదాపు ఆరు వేల సంవత్సరాల కిందట వాతావరణంలో ఏర్పడిన మార్పుల నేపథ్యంలో సముద్రం వెనక్కి వెళ్లినట్లు చెబుతారు.
దాంతో అక్కడ ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. వాటిపై కురిసిన వర్షానికి, గాలుల తీవ్రతకు దిబ్బలు కరిగి లోయలుగా మారాయి. ఆ లోయలు చూడడానికి అందంగా ఉంటాయి. ఈ దిబ్బలపై కన్పించే ఇసుక రేణువుల వయసు మూడు వేల సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా వేశారు. ఈ దిబ్బల్లో ఎన్నో సినిమాలు రూపుదిద్దుకున్నాయి.
తిరుమల తిరుపతి కొండలకు మరో అరుదైన గౌరవం దక్కింది. సహజ వారసత్వ సంపదగా వినూతికెక్కిన తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని ఏడు ఆస్తులు యునెస్కో గుర్తింపుకు చేరువయ్యాయి. ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం రూపొందించిన తాత్కాలిక జాబితాలో వాటికి చోటు లభించింది.
గుర్తింపు కోసం లిస్టులో చోటు చేసుకున్న వాటిలో మహారాష్ట్రలోని పంచగాని, కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు (ఈస్ట్ ఖాసి హిల్స్), మహాబలేశ్వర్ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్స్, కేరళలోని వర్కాల సహజ వారసత్వ సంపద, నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్ తదితరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని యునెస్కో తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఏడుతో కలిపి ఇప్పటివరకు తాత్కాలిక జాబితాలో చోటు లభించిన వాటిలో మనదేశం నుంచి 69 అంశాలు ఉండటం గమనార్హం.