ఒక్కటైన కవల జంటలు.. కవల అన్నదమ్ములతో కవల అక్కాచెల్లెళ్ల పెండ్లి

ఒక్కటైన కవల జంటలు.. కవల అన్నదమ్ములతో కవల అక్కాచెల్లెళ్ల పెండ్లి
  •     వరల్డ్​ ట్విన్స్​ డేకు ఏకమైన జంటలు      

కామారెడ్డి, వెలుగు: ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లాలో అరుదైన వివాహం జరిగింది. కవల అక్కాచెల్లెల్లు, కవల అన్నదమ్ములతో ఒకే వేదికపై పెండ్లి చేసుకోవడం విశేషంగా నిలిచింది. తాడ్వాయి మండలం దేమికలాన్‌‌కు చెందిన కుమ్మరి రాజమణి, సాయన్నల కవల కుమార్తెలు కీర్తన, కీర్తిల పెండ్లి మాచారెడ్డి మండలం ఘన్‌‌పూర్‌‌కు చెందిన దుంపల సుజాత కవల కొడుకులు విజయ్‌‌, వినయ్‌‌లతో ఆదివారం జరిగింది.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌‌లో ఈ వివాహ వేడుక నిర్వహించారు. కవల అక్కాచెల్లెల్లు, కవల అన్నదమ్ములు ఒకే కుటుంబంగా మారడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కవల అబ్బాయిలకు కవల అమ్మాయిలతో వివాహం జరగడం ఆనందంగా ఉందని ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు తెలిపారు.