మన విజన్కు ప్రతిబింబం స్టార్టప్​ల బూమింగ్

మన విజన్కు ప్రతిబింబం స్టార్టప్​ల బూమింగ్

న్యూఢిల్లీ: మనదేశం మరికొన్ని రోజుల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ స్టార్టప్​ల సంఖ్య 75 వేలకు పెరిగిందని కేంద్రమంత్రి వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్​ గోయల్​ బుధవారం ప్రకటించారు. మన విజన్ ఏంటో,​ పవర్​ ఏంటో ఈ సంఖ్యలు చెబుతున్నాయని ట్వీట్​ చేశారు.

ఇన్నొవేషన్, ఎంటర్​ప్రైజెస్​ డ్రైవ్​ గ్రోత్​కు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇస్తోందని చెప్పారు. త్వరలోనే ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్​ ఎకోసిస్టమ్​గా ఎదుగుతుందని ఆశాభావం ప్రకటించారు. స్టార్టప్​లు విదేశాలకు బదులు ఇండియా మార్కెట్లలోనే లిస్ట్​ కావాలని, కొన్ని అదనపు డాలర్ల కోసం బిజినెస్​ను సొంత దేశం నుంచి తరలించొద్దని సూచించారు.