కేరళలో రేపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ

కేరళలో రేపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ

కేరళలోని తిరువనంతపురంలో రేపు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. 15 రోజుల ముందే అమిత్ షా  మీటింగ్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. అయితే అదే సమయంలో  సీఎం కేసీఆర్ రాష్ట్ర కేబినెట్ భేటీ, టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు.అమిత్ షా మీటింగ్ కు హాజరుకావాల్సి వస్తుందనే సీఎం కేసీఆర్ రేపు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ కేంద్రమంత్రులు, ప్రధాని సమావేశానికి ఏదో ఒక కారణం చెప్పి సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు . నీతి ఆయోగ్ తో ఉపయోగం లేదని.. ఆ సమావేశానికి వెళ్లి మాట్లాడితే గోడకు చెప్పినట్లేనని.. బహిష్కరిస్తున్నట్లు సీఎం చెప్పారు. గతంలో ఇలా చాలా మీటింగ్ లకు కేసీఆర్ డుమ్మాకొట్టారు. గతేడాది తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీకి కూడా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.