హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని పి.ఎస్.ఆర్ గార్డెన్ లో వాటర్ ట్యాంకర్ ఢీకోని ఏఎస్ఐ దేవీసింగ్(60)మృతి చెందారు.
శనివారం (నవంబర్ 01) పీయస్.ఆర్ గార్డెన్ లో పోలీసులు పరేడ్ నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్న దేవీసింగ్ పరేడ్ లో పాల్గొనకుండా పక్కన నిలబడ్డాడు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన నీళ్ల ట్యాంకర్ (డీసీయం) ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ALSO READ : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్గ్రేషియా
ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వేగంగా ట్యాంకర్ ను టర్నింగ్ చేయడంతో ఏఎస్ఐని ఢీకొట్టింది. కిందపడటంతో టైర్ ఎక్కడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.
