గొర్రె ధర రూ.కోటి.. అయినా అమ్మని యజమాని.. ఎందుకో తెలుసా?

గొర్రె ధర  రూ.కోటి.. అయినా అమ్మని యజమాని.. ఎందుకో తెలుసా?

గొర్రె ధర సాధారణంగా ఎంత ఉంటుంది. మహా అయితే రూ.8 – 15 వేల మధ్యలో అంతేనా. ఇప్పుడు మీరు చదవబోయే గొర్రె గురించి వింటే షాక్ అవుతారు. దాని ధర అక్షరాల రూ.కోటి. మీరు విన్నది నిజమే ఫొటోలో చూస్తున్న గొర్రే అది. రాజస్థాన్​లోని చురు  జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారుడు రాజు సింగ్​ వద్ద గల గొర్రె రికార్డు స్థాయిలో రూ.కోటి ధర పలికి ఆశ్చర్యపరిచింది. 

ముస్లింలు పవిత్రంగా భావించే '786' సంఖ్య దాని పొట్టపై ఉర్దూలో ఉండటమే ఈ రికార్డు ధరకు కారణంగా తెలుస్తోంది. గతేడాదే పుట్టిన ఈ జీవాన్ని కొనడానికి చిన్నపాటి వేళం పాటే నిర్వహించారు. రూ.70 లక్షలు ఇస్తామని ఒకరనగా.. చివరగా రూ.కోటి ఇస్తామని మరొకరు ముందుకొచ్చినట్లు యజమాని తెలిపాడు. అయితే ఆ గొర్రె తనకెంతో ఇష్టమని అందుకే ఎంత డబ్బిచ్చినా అమ్మేది లేదని ఆయన చెప్పడం విశేషం.