సూర్యాపేట, వెలుగు: మా ఓటు అమ్ముకోం అభివృద్ధి చేయకపోతే ప్రశ్నిస్తాం అనే కాన్సెప్ట్ తో ఇంటి ముందు బోర్డు పెట్టి ఓ ఓటరు వినూత్నంగా స్పందించాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఎల్లంకొండ వెంకటరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి గోడపై ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు .
ఎలాంటి వాల్ పోస్టర్లు, డోర్ పోస్టర్లు అంటించరాదని, మేము డబ్బులు , మద్యం తీసుకొని ఓటు వేయమని మా ఓటుకి విలువ కట్టొద్దని రాసి ఉంచారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
