నీ ముఖంపై చిరునవ్వు, ఆనందం ఎప్పటికీ అలానే ఉండాలి : విఘ్నేష్ శివన్

నీ ముఖంపై చిరునవ్వు, ఆనందం ఎప్పటికీ అలానే ఉండాలి : విఘ్నేష్ శివన్

లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు (నవంబర్ 18) సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనతో కలిసి నయన్ 9వ సారి పుట్టినరోజు జరుపుకొంటోందని..ఇంతకు ముందు దాని కన్నా ఈ బర్త్ డే మాత్రం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. ఈ ఏడాదిలో ఎన్నో మరిచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. అందులో ఈ రోజు అంతకన్నా స్పెషల్ డే అన్న విఘ్నేష్.. ఈ సంవత్సరం తాము భార్యాభర్తలుగా ప్రయాణాన్ని ప్రారంభించామని చెప్పారు. ఇద్దరు పిల్లలకు కూడా తల్లీదండ్రులమయ్యామని అన్నారు. "నువ్వెంతటి శక్తిమంతమైన వ్యక్తివో నాకు తెలుసు. ఆత్మవిశ్వాసం, అంకిత భావంతో పని చేస్తుంటావు. నిజాయతీ, చిత్తశుద్ధితో ముందుకెళ్తూ స్ఫూర్తి నింపావు. ఓ తల్లిగా నువ్వు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నావు. మునుపటి కంటే మరింత అందంగా కనిపిస్తున్నావు" అని విఘ్నేష్ రాసుకొచ్చారు.

మన పిల్లలు నిన్ను ముద్దాడతారు కాబట్టి నువ్వు మేకప్‌ వేసుకోవాల్సిన అవసరం ఉండదని విఘ్నేష్ అన్నారు. నీ ముఖంపై చిరునవ్వు, ఆనందం ఎప్పటికీ అలానే ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాని చెప్పారు. తాను జీవితంలో స్థిరపడ్డానని అనిపిస్తోందని, లైఫ్‌ అందంగా, సంతృప్తిగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఉన్నంత సంతోషమే మన (పిల్లలతో) అందరి పుట్టినరోజున ఉండాలని కోరుకుంటున్నాన్నారు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. మై లేడీ అండ్‌ సూపర్‌స్టార్‌’’ అని విఘ్నేశ్‌ తన భావాలను ఇలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.