దర్శనమిచ్చిన మంచు చిరుత ..వీడియో

దర్శనమిచ్చిన మంచు చిరుత ..వీడియో

భారత్, చైనా  సరిహద్దులోని లడ్డాఖ్ లో  ఓ మంచు చిరుత ప్రత్యక్షమైంది. పర్వత మేకలను వేటాడుతుండగా...పర్యాటకులు తన కెమెరాలో చిరుతను బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పర్వత మేకలను వేటాడుతున్న చిరుత వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వేగంగా వేట..

పర్వతం పైన ఉన్న మంచు చిరుత...పర్వతం మధ్యలో గడ్డి తింటున్న మేకలను చూసింది. వెంటనే అత్యంత వేగంతో కిందకు పరిగెత్తుకుంటూ వచ్చింది. చిరుత చూసిన మూడు మేకల్లో రెండు వేరే దారిలో పరిగెత్తి తప్పించుకున్నాయి. అయితే అప్పటికే తన టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్న చిరుత...మూడో మేక వెంటపడింది. తప్పించుకునే క్రమంలో మేక కిందపడిపోయింది. మేకను వెంబడించిన చిరుత..కిందకు దూకి దాన్ని నోట కర్చుకుని తీసుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు అనేక లైక్‌లు, కామెంట్స్ వస్తున్నాయి. 

మంచు చిరుత ఎక్కడ ఉంటుందంటే..?

ప్రపంచంలో మనిషిని పోలిన మనిషులు ఉన్నట్టే.. చిరుతలను పోలిన చిరుతలు ఉంటాయి. అయితే చిరుతలు, చీతాలు ఒకటి కాదు. ఇవి  రెండు కూడా పిల్లి జాతికి చెందినవే. కానీ ఎన్నో వైరుధ్యాలున్నాయి. వీటిల్లో మంచు చిరుత భిన్నమైంది. ఇది 25 నుంచి 55 కిలోల వరకు బరువు ఉంటుంది. సెంట్రల్, దక్షిణాసియాలోని మంచు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి చాలా పొడవైన తోక ఉంటుంది.  జంతువును వేటాడటంలో ఆ తోకను ఉపయోగించుకుంటుంది. హిమ పర్వతాలలో చాలా చాకచక్యంగా వేటాడుతూ ఉంటుంది. లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మంచు చిరుతను తమ రాష్ట్రీయ జంతువుగా ప్రకటించాయి.

పర్వతాల దెయ్యం అని పేరు..

మంచు చిరుతలను "పర్వతాల దెయ్యం" అని కూడా పిలుస్తారు, ఇవి హిమాలయాల మంచుతో కప్పబడిన శిఖరాలలో నివసిస్తాయి, అత్యంత అరుదుగా  కనిపిస్తాయి.