చంద్రబోస్ కలం, గళం నుంచి..

చంద్రబోస్ కలం, గళం నుంచి..

గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాను  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాగా, తాజాగా ఓ పాటను విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన ఈ పాటకు ఆస్కార్ విజేత చంద్రబోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాహిత్యం అందించడంతో పాటు ఆయనే పాడడం విశేషం.  

‘లేదే లేదే... లేదే ప్రేమసలే.. లోకం లోనే ప్రేమే లేదసలే.. మోహాన్నే ప్రేమంటూ పిలిచారే.. కామాన్నే ప్రేమంటూ తలచారే.. లాభాన్నే ప్రేమంటూ కొలిచారే.. స్వచ్ఛంగా ప్రేమంటూ లేదే లేదే..’ అంటూ ప్రేమలో విఫలమైన వ్యక్తి హృదయాన్ని ఆవిష్కరించేలా సాహిత్యం రాసిన చంద్రబోస్.. ఆ వేదనను తన గొంతులో పలికించారు. మే 17న సినిమా విడుదల కానుంది.