డార్లింగ్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజాసాబ్(Rajasaab). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
గతేడాది అక్టోబర్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కేవలం ఈ మూవీ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ తో ఫ్యాన్స్ ను మేకర్స్ కాస్తా ఖుషి చేసిన.. ఇంకొన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ (అక్టోబర్ 21న) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ది రాజా సాబ్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ వచ్చేయనుంది.
Also Read :- రానా భార్య మిహికా, రకుల్ ప్రీతీ సింగ్ స్పెషల్ పోస్ట్ వైరల్
ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23న) కి ముందే రివీల్ కానుంది. ఈ ప్రత్యేక పోస్టర్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ అప్డేట్ రానుండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
4.05PM…….🕺🏻
— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024
Nenu ready..
Meeru ready na?#Prabhas #TheRajaSaab pic.twitter.com/R15IzBO9dg