
యంగ్ టైగర్ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు NTR30 మేకర్స్. ప్రస్తుతం ఆయన కొరటాళ శివతో ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ తో పాటు బ్రాండ్ న్యూ పోస్టర్స్ ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారట. అంతేకాదు.. ఈ పోస్టర్ తో పాటు టైటిల్ను కూడా రివీల్ చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారు. సినిమాకి ఆయన అనుకున్న టైటిల్ ను అందరూ ఆమోదిస్తే తారక్ బర్త్ డే రోజు కచ్చితంగా అనౌన్స్ చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇక మే మూడో వారంలో చిత్ర బృందం మూడో షెడ్యూల్ ని కూడా ప్రారంభించనున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో నటించబోతున్నాడు. ఇక అనౌన్స్మెంట్ వీడియోతోనే అంచనాలని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లిన ఈ సినిమా తారక్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని పోర్టు నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.