కరోనా రూపాలు మారట్లే..వ్యాక్సిన్ బాగా పనిచేస్తది

కరోనా రూపాలు మారట్లే..వ్యాక్సిన్ బాగా పనిచేస్తది

వాషింగ్టన్హెచ్​ఐవీ (ఎయిడ్స్​) కన్నా కరోనా వైరస్​ ఎన్నెన్నో రూపాలు మార్చిందని ఇంతకుముందు సైంటిస్టులు చెప్పారు. అయితే, అనుకున్నన్ని మ్యుటేషన్లేమీ జరగలేదని తాజాగా సైంటిస్టులు చెబుతున్నారు. కాబట్టి వ్యాక్సిన్​కు ఎలాంటి ఢోకా ఉండబోదని భరోసా ఇస్తున్నారు. అమెరికాలోని వాల్టర్​ రీడ్​ ఆర్మీ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ రీసెర్చ్​ సైంటిస్టులు 84 దేశాలకు చెందిన 27 వేల మందిపై స్టడీ చేసి ఈ విషయాన్ని చెప్పారు.వాళ్ల నుంచి తీసుకున్న 18,514 వైరస్​ జీనోమ్​లను సీక్వెన్స్​ చేసి.. పెద్దగా మ్యుటేషన్లు లేవని తేల్చారు. వుహాన్​లో మహమ్మారి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్​ జీన్స్​లలో మార్పులు జరిగింది చాలా తక్కువన్నారు. మనిషిలోకి ఎంటరైన తర్వాత కన్నా కూడా.. ముందే ఆ వైరస్​ జీన్స్​లో మార్పులు వచ్చినట్టు గుర్తించారు.

ముందు నుంచి చెబుతున్నట్టు వైరస్​ స్పైక్​లో ‘డీ614జీ’ మ్యుటేషన్లు జరుగుతున్నా.. మనుషుల్లో ఎంటరయ్యాక మాత్రం జరగట్లేదని స్టడీలో పాల్గొన్న వాల్టర్​ రీడ్​ సైంటిస్ట్​ మోర్గాన్​ రోలండ్​ చెప్పారు. వేర్వేరు స్ట్రెయిన్లకు చెందిన జీన్స్​ను లింక్​ చేయడం చాలా కష్టమైన పని అన్నారు. అయితే, డీ614జీ మ్యుటేషన్​పై మరింత స్టడీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కరోనాకు తయారవుతున్న వ్యాక్సిన్​ ఏదైనా సరే బాగానే పనిచేస్తుందన్నారు. స్ట్రెయిన్​ ఏదైనా వ్యాక్సిన్​ పనితీరు మెరుగ్గా ఉంటుందన్నారు. హెచ్​ఐవీ, ఇన్​ఫ్లుయెంజా, డెంగ్యూతో పోలిస్తే కరోనాకు వ్యాక్సిన్​ తయారు చేయడం పెద్ద కష్టం కాదన్నారు. కాగా, ఇండియా సహా ఆరు దేశాల్లో గర్భిణులపై కరోనా ప్రభావాన్ని తెలుసుకునేందుకు అమెరికాలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​ స్టడీ చేయనుంది. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్​, కెన్యా, జాంబియా, కాంగో, గ్వాటెమాలాల్లో స్టడీ చేయనుంది. గర్భం టైంలో, పిల్లలు పుట్టాక ఏడాది వరకు వారిపై కరోనా ప్రభావం ఎంత ఉంటుందో తేల్చనున్నారు సైంటిస్టులు.