ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ వర్క్‌‌‌‌‌‌‌‌కు ఉద్యోగులు నో: ప్రముఖ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ కంపెనీ సర్వేలో వెల్లడి

ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ వర్క్‌‌‌‌‌‌‌‌కు ఉద్యోగులు నో: ప్రముఖ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ కంపెనీ సర్వేలో వెల్లడి
  • హెల్త్, వర్క్‌‌‌‌‌‌‌‌–లైఫ్ బ్యాలెన్స్ దెబ్బ తింటుంది: జీనియస్ రిపోర్ట్‌‌

ముంబై: ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ వర్క్ చేయడంపై  ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ కంపెనీ జీనియస్ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ టెక్  నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. జీనియస్ డిజిపోల్ రిపోర్ట్ ప్రకారం, అదనపు బెనిఫిట్స్ లేకుండా ఉద్యోగ సమయాలను పెంచడాన్ని మెజార్టీ రెస్పాండెంట్లు వ్యతిరేకించారు. వర్క్‌‌‌‌‌‌‌‌ లైఫ్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌ దెబ్బతింటాయని  44 శాతం మంది  పేర్కొన్నారు. 

అయితే, 40శాతం మంది తగిన బెనిఫిట్స్  ఉంటే ఓవర్ టైమ్ చేయడానికి ఇబ్బందేమి లేదని చెప్పారు. కేవలం 16శాతం మంది మాత్రమే దీన్ని ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.  ఈ ఏడాది జులై 1–31 మధ్య 2,076 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు.   పని సమయాలను మార్చే చర్చల్లో తాము పాల్గొనాలని చూస్తున్నామని 79శాతం మంది అన్నారు.