
- ఆర్మేనియాలో విషాదం
యెరెవాన్: ఆర్మేనియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ స్టేషన్‌లో పేలుడు సంభవించి సుమారు 20మంది చనిపోయారు. దాదాపు 300మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు తెలిసింది. సోమవారం అర్ధరాత్రి నాగర్నో-కారాబఖ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నాగర్నో-కారాబఖ్ ఏరియాలో ఆర్మేనియా సైనికులపై అజర్‌బైజాన్ ఆర్మీ కొన్ని రోజులుగా దాడులకు పాల్పడుతోంది. దీంతో వేలాదిమంది ప్రజలు ఆ ప్రాంతం నుంచి ఆర్మేనియాకు తరలిపోతున్నారు. ఈ క్రమంలోనే గ్యాస్ స్టేషన్ లో కార్లలో ఇంధనం నింపుకునేందుకు వాహనదారులు బారులు తీరారు.
ఆ టైంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం నాటికి 6,500 మందికి పైగా నగర్నో-కారాబాఖ్ నుంచి ఆర్మేనియాకు పారిపోయారని ఆర్మేనియన్ ప్రభుత్వం తెలిపింది.