150 చోరీలు, రెండేండ్ల జైలు.. అయినా మారలే ! దొంగ అరెస్ట్.. పీడీ యాక్ట్ నమోదు

150 చోరీలు, రెండేండ్ల జైలు.. అయినా మారలే ! దొంగ అరెస్ట్.. పీడీ యాక్ట్ నమోదు

ఓల్డ్​సిటీ వెలుగు: 150 చోరీలు చేశాడు. రెండేండ్ల జైలుశిక్ష అనుభవించాడు. అయినా .. మారలేదు.  బయటకొచ్చినా చోరీలు మానలేదు.  పాత నేరస్థుడిని  బండ్లగూడ పోలీసులు అరెస్ట్ ​చేసి పీడీ యాక్ట్ ​నమోదు చేశారు.  చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ మంగళవారం  వివరాలు వెల్లడించారు. బండ్లగూడ అలీనగర్​కు చెందిన మహమ్మద్ సలీం అలియాస్​ సునీల్ శెట్టి(52) వరుస చోరీలకు పాల్పడుతుండటంతో 2018లో కంచన్​బాగ్ పీఎస్ , 2021లో ఫలక్​నుమా పీఎస్ లో పీడీ యాక్ట్​ నమోదైంది. రెండేండ్లు జైలుకు వెళ్లి, గత ఆగస్టులో విడుదలయ్యాడు. మళ్లీ బండ్లగూడ పీఎస్  పరిధిలో 3, బాలాపూర్​ పీఎస్  పరిధిలో ఒక చోరీ చేశాడు.  బండ్లగూడ పోలీసులు కూడా పీడీ యాక్ట్​నమోదు చేశారు. సునీల్​శెట్టి వద్ద  10 తులాల బంగారం, 10 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ తెలిపారు.