Jobs: టెన్త్ అర్హతతో 25,487 ప్రభుత్వ ఉద్యోగాలు.. నిరుద్యోగులు ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..

Jobs: టెన్త్ అర్హతతో 25,487 ప్రభుత్వ ఉద్యోగాలు.. నిరుద్యోగులు ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్(GD), రైఫిల్‌మన్(GD) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 31.

పోస్టుల సంఖ్య: 25487. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), రైఫిల్ మన్ (జనరల్ డ్యూటీ).

పోస్టులు: బీఎస్ఎఫ్ 616 (పురుషులు 524, మహిళలు 92), సీఐఎస్ఎఫ్ 14,595 (పురుషులు 13,135, మహిళలు 1460) , సీఆర్​పీఎఫ్ 5,490 (పురుషులు 5366, మహిళలు 124), ఎస్ఎస్​బీ 1764 (పురుషులు 1764, మహిళలు 0), ఐటీబీపీ 1293 (పురుషులు 1099, మహిళలు 194), ఏఆర్ (రైఫిల్ మన్ జీడీ) 1706 (పురుషులు 1556, మహిళలు 150), ఎస్ఎస్ఎఫ్ 23 (పురుషులు 23, మహిళలు 0). 

ఎలిజిబిలిటీ: 2026, జనవరి 1 నాటికి  గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్లికేషన్​లో సూచించిన రాష్ట్రం/ యూటీ నివాసం/ పీఆర్​సీ (అసోం & ప్రత్యేకంగా పేర్కొన్న వర్గాలు మినహా) కలిగి ఉండాలి. ఎన్​సీసీ సర్టిఫికేట్ హోల్డర్లు బోనస్ మార్కులకు అర్హులు (ఆప్షనల్). 

వయోపరిమితి:  (2026, జనవరి 1 నాటికి) 

కనీస వయసు: 18 ఏండ్లు.

గరిష్ట వయసు: 23 ఏండ్లు. (-2003, జనవరి 02  కంటే ముందు 2008, జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు)

సడలింపు: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, మాజీ సైనికులకు మూడేండ్లు, 1984 అల్లర్ల బాధితుల పిల్లలు/ఆశ్రితులు (అన్ రిజర్వ్​డ్/ ఈడబ్ల్యూఎస్) ఐదేండ్లు, ఓబీసీలకు ఎనిమిదేండ్లు, ఎస్సీ/ ఎస్టీలకు10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 01.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మన్/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 31. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్​టీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (తాత్కాలిక షెడ్యూల్): 2026, ఫిబ్రవరి– ఏప్రిల్. 

పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
కంప్యూటర్ బేస్డ్ టెస్టులో  ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం 160 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్– ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 20 ప్రశ్నలు 40 మార్కులకు,  పార్ట్–-బీలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు 40 మార్కులకు పార్ట్–సీలో ఎలిమెంటరీ స్థాయి గణితం 20 ప్రశ్నలు 40 మార్కులకు పార్ట్-–డీలో ఇంగ్లిష్/ హిందీ 20 ప్రశ్నలు 40 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్-చాయిస్ టైప్‌లో ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంగ్లిష్, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది.నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 శాతం మార్కులు కోత విధిస్తారు.

సీబీటీలో అభ్యర్థులు సాధించిన మార్కులను కమిషన్ ప్రచురించిన విధానాన్ని ఉపయోగించి నార్మలైజేషన్ చేస్తారు.ఎన్​సీసీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులను కలిపిన తర్వాత తుది మెరిట్, కట్-ఆఫ్ మార్కులను నిర్ణయిస్తారు.